బ్యాంకులో ఖాతా ఉన్నవారు బీమా తప్పనిసరిగా చేసుకోవాలి..

11-11-2026 | 05:49pm

మేనేజర్ సాయికుమార్ 

బెజ్జూర్ నవంబర్ 11 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కృష్ణపల్లి గ్రామంలో గ్రామ సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయికుమార్(Telangana Grameena Bank Manager Saikumar) మాట్లాడుతూ, మహిళా సంఘాల సభ్యులు రైతులందరూ రుణాలు సక్రమంగా చెల్లించాలని సూచించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన పథకాలలో అర్హత గల సభ్యులు నమోదు చేసుకోవాలని కోరారు. 

లఖ్ పతి రుణాలు మంజూరు చేస్తామని, అర్హులైన సభ్యులు రుణాలు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ ఓటీపీలు, బ్యాంక్ వివరాలు చెప్పి మోసపోవద్దని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్డేపల్లి లావణ్య శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ మనోజ్, సీసీ భద్రయ్య, ఎఫ్ఎల్ సీ కోఆర్డినేటర్ రాజబాబు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు