వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
జగిత్యాల, నవంబర్ 11 ( విజయ క్రాంతి ): జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) జగిత్యాల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ చల్గల్ లో(Chalgal Agricultural Market) ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. లక్ష ఎస్ ఎఫ్ టి తో 8 కోట్ల తో షెడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందనీ, 1 కోటి 80 లక్షల తో సీసీ రోడ్డు పనులు చేయటం జరిగిందన్నారు.
ఎల్ నీ నో ప్రభావం వల్ల రైతులు ఆరుతడి పంటలు పండించే ఆలోచన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రసూనాంబ, పీఏసీఎస్ చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, డీసీఓ మనోజ్, ఎమ్మార్వో హకీం, ఏఎంసీ వైస్ చైర్మన్ అబ్బూరి మల్లేశం గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెండెంరాములు, బాలముకుందం, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.