ఎండు గంజాయి పట్టివేత

05-11-2026 | 07:50pm

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరు నుండి హైదరాబాదుకు కారులో గంజాయి(Ganja) అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district) గూడూరు పోలీసులు అరెస్ట్ చేసి 13.84 లక్షల విలువైన 27.6 కిలోల గంజాయి, కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గూడూరు సీఐ వినయ్ కుమార్(Gudur CI Vinay Kumar) కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

గూడూరు ఎస్ ఐ చిర్ర రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి కోబల్ తండా క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, టీ ఎస్ 21 టీ 7453 నంబరు గల తెలుపు రంగు మారుతి కారులో ఒక పురుషుడు ఒక మహిళ అనుమానాస్పదంగా వస్తుండటాన్ని గమనించారు. వెంటనే ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, కారు డిక్కీలో సుమారు 27.6 కిలోల ఎండు గంజాయి లభించింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.13,82,700 గా ఉంటుందని చెప్పారు.

విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరు ప్రాంతం నుండి గంజాయిని సేకరించి, హైదరాబాద్‌లోని ఒక వ్యక్తికి అందజేసేందుకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఈ సంఘటనలో గూడూరు మండలం భూపతి పేట శివారు బోడ చక్ర తండాకు చెందిన లావుడ్య దేవి @ ఝాన్సీ, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ శివారు కోరంకుంట తండా కు భూక్యా నవీన్ ను అరెస్టు చేసి, వారి వద్ద నుండి అక్రమంగా రవాణా చేస్తున్న 27.6 కిలోల ఎండు గంజాయి, నేరానికి ఉపయోగించిన తెలుపు రంగు మారుతి కారు రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు