కొండపాకను కరువు మండలంగా ప్రకటించాలి
సర్వసభ్య సమావేశంలో కీలక తీర్మానాలు
కొండపాక, నవంబర్ 5 (విజయక్రాంతి): కొండపాక మండల రైతు వేదికలో(Farmers' Platform) గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా కొండపాక మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, ఉపాధి హామీ కూలీల(Employment Guarantee Scheme wage) గౌరవ వేతనం పెంచాలని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోటాలో ఓటు హక్కు కల్పించాలని తీర్మానించారు.
ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మ్యాజిక్ సోక్ పిట్స్, కమ్యూనిటీ సోక్ పిట్స్, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, ఫామ్ పాండ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రజలకు తాగునీరు, విద్యుత్, వ్యవసాయ అవసరాల్లో ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి టి గోపాల కృష్ణమూర్తి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.