మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ..
ఆలేరు, నవంబర్ 5 (విజయక్రాంతి): ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Alair MLA Beerla Ilaiah) చొరవతో తుర్కపల్లి మండలం బాబుల్ నాయక్ తండాలో ప్రత్యేక నిధులతో నిర్మించనున్న మహిళా భవనానికి గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాడోత్ మంగీతి, మాజీ ఎంపీటీసీ ధనావత్ మోహన్ బాబు నాయక్ పాల్గొని భూమి పూజ చేశారు.
మహిళా సంఘాలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి గ్రామపంచాయతీ భవనం నిర్మించేందుకు కూడా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.