అయ్యప్ప స్వాముల కోసం బోరు మోటర్ ఏర్పాటు
రాజాపూర్ నవంబర్ 20: బాలానగర్ మండల(Balanagar Mandal) పరిధిలోని ఉడిత్యాల గ్రామంలో అయ్యప్ప స్వాములకు నేటి సమస్య తీర్చేందుకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు(TRS party leaders) చించోడ్ అభిమన్యు రెడ్డి గత నెలలో తన సొంత నిధులు వెచ్చించి బోరు డ్రిల్లింగ్(Borehole drilling) చేయించారు. శుక్రవారం బోరు మోటర్ బిగించి ప్రారంభించారు.
గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు, అయ్యప్ప మాల ధరించిన భక్తులకు(devotees), గ్రామ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా నీటి ఇబ్బంది ఉండేది. దేవాలయంలో పూజలు, అన్నదానం, భజన కార్యక్రమాల సమయంలో నీటి కోసం చాలా ఇబ్బంది పడేవారు. ఆ బాధను చూసి అభిమన్యు రెడ్డి ముందుకు వచ్చి ఈ బోరు వేయిండం పట్ల అయ్యప్ప స్వామి భక్తులు(devotees),గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ బోరు మోటర్ ప్రారంభంతో ఇకపై భక్తులకు(devotees), గ్రామ ప్రజలకు తాగునీటికి, దేవాలయ అవసరాలకు ఎలాంటి కొరత ఉండదని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అభిమన్యు యువసేన సభ్యులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.