బీజేపీ నూతన కార్యవర్గ సమావేశం
నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం
గండీడ్,నవంబర్ 18:విజయక్రాంతి: వికారాబాద్ జిల్లా అధ్యక్షులు యు.రమేష్ కుమార్ మార్గదర్శకత్వంలో, మండల పరిధిలోని సల్కర్‌పేట్‌లోని మండల బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు క్యాసారం విజయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు,కోశాధికారి, వివిధ మోర్చాల అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నాయకులు,కార్యకర్తలు కుటుంబ సభ్యుల్లా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.