వేసవి నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
12-11-2026 | 10:10pm
18వ వార్డులో బోరుబావి ఫ్లషింగ్ పనులు ప్రారంభం
జడ్చర్ల, నవంబర్ 12: రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా జడ్చర్ల మున్సిపాలిటీ అధికారులు(Jadcherla Municipality Officials) ముందస్తు చర్యలు చేపడుతున్నారు.ఇందులో భాగంగా పట్టణంలోని 18వ వార్డు, శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం సమీపంలో బోరుబావి ఫ్లషింగ్ పనులు చేపట్టారు.
త్వరలో బోరుబావికి మోటారు ఏర్పాటు చేసి దేవాలయానికి వచ్చే భక్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. వేసవిలో నీటి కొరత లేకుండా ప్రజలకు అవసరమైన నీటి వసతులు అందించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ ఈ ముందస్తు చర్యలు చేపడుతోంది.