అర్హులైన పేదలకు పింఛన్ల పంపిణీ.

20-11-2026 | 04:29pm

మఠంపల్లి, నవంబర్ 20 (విజయక్రాంతి): అర్హులైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని తహశీల్దార్ హిమబిందు అన్నారు. మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండాలో కొత్తగా మంజూరైన పింఛన్లను సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్‌తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ (Pension Distribution) చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం (Government) అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ మాట్లాడుతూ గ్రామంలోని అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు. రానున్న రోజుల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి (Village Development) చేస్తానని తెలిపారు. కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఆర్ఐ శివ, కార్యదర్శి నరేష్, జిపిఓ మల్లయ్య, ఉపసర్పంచ్ ధరవతు నితిన్ నాయక్, వార్డు సభ్యులు నాగేశ్వరరావు, యలమంద, పార్వతి, బాలు, హనుమా, నాగు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు