డిగ్రీ అతిథి అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి
ఈ నెల 22న కరీంనగర్లో సమావేశం
పెద్దపల్లి జిల్లా అతిథి అధ్యాపకుల అధ్యక్షుడు ఉడుత ముకుందం పిలుపు
మంథని, నవంబర్ 20(విజయక్రాంతి) : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో(Government Degree College) పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల సమస్యల(Issues faced by guest faculty) పరిష్కారం, ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నెల 22వ తేదీన ఆదివారం కరీంనగర్లో(Karimnagar) నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా(Peddapalli District) అతిథి అధ్యాపకుల అధ్యక్షుడు ఉడుత ముకుందం పిలుపునిచ్చారు.
కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలకు(Karimnagar, Warangal, Adilabad, and Siddipet districts) చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అతిథి అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి టీచర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ (TCE-JAC) చైర్మన్ డాక్టర్ కె. సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు.
ఈ సమ్మేళనంలో అతిథి అధ్యాపకులు ఎదుర్కొంటున్న ఉద్యోగ భద్రత, వేతనాలు, సర్వీస్ రెన్యువల్ తదితర సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. అధ్యాపకుల ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్లు వివరించారు.
ప్రభుత్వం తమ సమస్యలను సానుభూతితో పరిశీలించి, న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అతిథి అధ్యాపకులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని ఉడుత ముకుందం కోరారు.
నాలుగు జిల్లాల అతిథి అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.