పంట దిగుబడి గుణంకాల నమోదు
రాజాపూర్ నవంబర్ 20: మండలంలోని రాయపల్లి గ్రామంలో(Rayapalli Village) శుక్రవారం వరి పంట దిగుబడి(Paddy crop yield) అంచనా కోసం పంట కోత ప్రయోగం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. గణాంక శాఖ (Statistics Department) ఇచ్చిన రాండమ్ నంబర్ల ఆధారంగా గ్రామాన్ని, ఆ తర్వాత పొలం సర్వే నంబర్‌ను ఎంపిక చేసిన పొలంలో ఒక మూల నుండి రాండమ్ సంఖ్యల ఆధారంగా అడుగులు వేసి, 5 మీటర్లు x 5 మీటర్ల చదరపు భాగాన్ని కొయ్యలతో గుర్తించినట్లు తెలిపారు.
ఆ చిన్న భాగంలోని పంటను మాత్రమే కోసి, గింజలను వేరు చేసి (నూర్పిడి చేసి), వచ్చిన పంట దిగుబడిని తూకం వేసి, ఆ వివరాలను ప్రభుత్వ మొబైల్ యాప్ ఫారమ్‌లలో Form-2 నమోదు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర గణాంక శాఖ అధికారులు ఎం. శ్రీనివాస్ రావ్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కాజా,స్టాటిస్టికల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, వ్యవసాయ విస్తరణ అధికారి పి. శ్రీనివాసులు రైతులు శ్రీశైలం, సాయి లింగం పాల్గొనారు.