అక్రమాలకు పాల్పడితే ఇళ్లు, పింఛన్లు కట్!
* పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు డబ్బులు ఇస్తే చర్యలు తప్పవు
* లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి
* కీతవారిగూడెం లో 80 మందికి ఆసరా పింఛన్లు, సీఎంఆర్ చెక్కుల పంపిణీ
* పీఏసీఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ హెచ్చరిక
* మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో అర్హులకు సంక్షేమ పథకాల అమలు
గరిడేపల్లి, నవంబర్ 20 (విజయ క్రాంతి) : అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను(government welfare schemes) అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని పీఏసీఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ(Juttukonda Satyanarayana) అన్నారు. మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లు, సీఎంఆర్ చెక్కులను(pensions, CMR checks) ఆయన పంపిణీ చేశారు. రాష్ట్ర సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సహకారంతో గ్రామానికి చెందిన 80 మంది లబ్ధిదారులకు పింఛన్లు, చెక్కులు అందజేశారు.
వీరిలో వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఉన్నారు.అలాగే ప్రజా పాలనలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామంలో 60 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు మంజూరు చేయించడంలో సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వ పథకాల మంజూరు కోసం ఎవరైనా డబ్బులు అడిగినా, తీసుకున్నట్లు రుజువైనా సంబంధిత లబ్ధిదారుల పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరును నిలిపివేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
ప్రభుత్వ పథకాలు పూర్తిగా పారదర్శకంగా అర్హులైన వారికే అందుతాయని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ చిత్తలూరు వీరస్వామి, కార్యదర్శి జానకమ్మ, వార్డు సభ్యుడు హరిబాబు, షేక్ నాగుల్ మీరా, ముత్తినేని సోమయ్య, బాల్దూరి అంజయ్య, ముత్తినేని సురేష్, బాదె నరసయ్య, కీత నవీన్, పాలెల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.