అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ
అడ్డాకుల నవంబర్ 3 విజయక్రాంతి: అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామం అంగన్వాడీ కేంద్రంలో(Anganwadi Centre, Baleedupalli Village) గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. తల్లి, బిడ్డ ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రం(Anganwadi Centre) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. గర్భధారణ సమయంలో మహిళలు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఎదుగుదలకు దోహదపడుతుందని వివరించారు. అలాగే బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శిశువులకు తల్లిపాలు అందించడం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్ రెడ్డి ఉప సర్పంచ్ రాధ శివ, ప్రవీణ్ రెడ్డి, అంగన్వాడి టీచర్ అరుణమ్మ, తదితరులు పాల్గొన్నారు,