కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం
మాజీ మంత్రులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి, డాక్టర్ వి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, అర్బన్ సెప్టెంబర్ 8 : బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో (BRS Party Office)నిర్వహించిన ప్రెస్మీట్లో మాజీ మంత్రులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి, మాజీ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కేసీఆ్ప కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్తో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సరికాదన్నారు. కెసిఆర్ ను అవమానించిన మాట్లాడడం ప్రజలకు మంచి చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్లక్ష్యానికి నిలువుటద్దంలో కాంగ్రెస్ పరిపాలన ఉందని వారి చేతగాని పనిని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం పూర్తిగా మార్చుకోవాలని నిర్లక్ష్యమనే మాటకు తావు లేకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించాలని డిమాండ్ చేశారు.
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కేసీఆ్ప అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాల్యానాయక్, రాజేశ్వర్గౌడ్, గంజి వెంకన్న, బస్వరాజ్, శివరాజ్, దేవేందర్రెడ్డి, ఆంజనేయులు, ప్రభాకర్రెడ్డి, బాలరాజు, గిరిధర్రెడ్డి, జంబులయ్య, కట్ట రవికిషన్ తదితరులు పాల్గొన్నారు.