జడ్చర్లలో వేడెక్కిన రాజకీయం
- ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సవాల్ స్వీకరించిన మాజీ మంత్రి
- సొంతం నిధులతో ఆసుపత్రిని కట్టిస్తానంటున్న ప్రతి సవాల్
- తొండి మాటలు మానుకొని స్థలం కేటాయించాలంటూ డిమాండ్
- పట్టణమంతా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల చర్చలు
జడ్చర్ల అక్టోబర్ 29: జడ్చర్ల నియోజకవర్గం(Jadcherla Constituency)లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నేతల సవాల్ ప్రతి సవాళ్లు ఒక్కసారిగా చర్చనీయాశంగా మారాయి. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రస్తుతం ఉన్న ఎమ్మార్వో కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం స్థలం ఇస్తానని సొంత నిధులతో ఆసుపత్రి కడతావా అంటూ మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డికి సవాల్ విసిరారు. ఈ విషయంపై ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి నువ్వు చెప్పినట్టు ఆ స్థలం కేటాయిస్తే ప్రజలకు ఉపయోగపడేలా సొంత డబ్బులతో ఆసుపత్రి నిర్మించి ఇస్తానని ఘాటుగా స్పందించారు.
ప్రజలకు మంచి చేసేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే అలవాటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కి మాత్రమే దక్కుతుందని మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పిన మేరకు ఆ స్థలం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించేందుకు కేటాయించడం జరుగుతుందా? జరగదా?అనే చర్చకు మరింత పదును ఎక్కుతుంది.
- ఎమ్మెల్యే స్థలం కేటాయిస్తారా?
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పిన మేరకు స్థలం కేటాయిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ ఓవైపు జనం ప్రత్యేకంగా చర్చించుకుంటుండ్రు. నిర్లక్ష్మ అనే మాటకు తావు లేకుండా స్థలం కేటాయింపులు చేసి మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ఆ నిర్మాణం చేపట్టేలా చేస్తారా? చేయరా? అనే సందేహం సమాధానం దొరకని ప్రశ్నగా మారుతుంది. జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ అంశం ప్రధాన అంశం గా చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ తరుణంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పిన మేరకు స్థల కేటాయింపు జరుగుతాయా జరిగా వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయ చర్చ..
ఓవైపు రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో జడ్చర్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అవకాశం ఉంటే రైతులకు మేలు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి సవాళ్లు చేస్తే ప్రజల లోపల చర్చ తప్ప మరేమైనా ఉపయోగం ఉంటుందా అంటూ మరికొందరు చర్చించుకుంటునరంట. కాగా ఈ సవాల్ మేరకు స్థలం కేటాయింపు జరిగితే పట్టణంలో ప్రజలకు ఉపయోగపడేలా మాజీమంత్రి చెప్పిన మాట మేరకు సొంత డబ్బులతో ఆసుపత్రి నిర్మాణం చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. కాగా ఈ అంశంపై జడ్చర్ల ఎమ్మెల్యే తీసుకోబోయే నిర్ణయంపై పట్టణ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.