ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాల పంపిణీ
05-11-2026 | 11:41pm
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపూర్, చిన్నవడ్డేమాన్ గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత మధుసూదన్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబం తరఫున లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. సొంతింటి కల నెరవేర్చిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.