జాతీయ రహదారిపై లారీ బీభత్సం
05-11-2026 | 11:49pm
గొర్ల కాపరి మృతి... 50 గొర్ల మృత్యువాత
ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లా లోని జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది. మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్ వెళుతున్న లారీ గురువారం ఇచ్చోడ మండల కేంద్రం బైపాస్ వద్ద జాతీయ రహదారిపై అతివేగంతో వచ్చి లారీ రహదారి దాటుతున్న గొర్ల మందను ఢీ కొట్టడంతో పాటు గొర్ల ను మోపుతున్న కాపరి హీరా ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 50 గోర్లు మృత్యువాత పడ్డాయి. తీవ్ర గాయాలపాలైన మేకల కాపరి హీరా ను ఆసుపత్రికి తరలించారు. ఐతే చికిత్స పొందుతూ హీరా మృతి చెందాడు. ప్రమాదం చేసి వెళ్ళిపోతున్న లారీని నేరడిగొండ దాబా వద్ద పోలీసులు పట్టుకొన్నారు.