పట్టభద్రుల ఓటరు దరఖాస్తుల పరిశీలన

05-11-2026 | 11:48pm

కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలకు(Graduate Elections) సంబంధించి అందిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు.గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.సుదర్శన్ రెడ్డి(State Chief Electoral Officer Dr. Sudarshan Reddy) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 16,028 దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 5,703 దరఖాస్తులను పరిశీలించి ఆమోదించాం.

మరో 9,952 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేస్తామన్నారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కుపై అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌లను ఏర్పాటు చేసి వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ విజయలక్ష్మి, డీటీ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు