అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాo

05-11-2026 | 11:54pm

మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్.

నేరేడుచర్ల,(విజయ క్రాంతి): అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్(Mass Line District Secretary Kothapally Shiva Kumar) అన్నారు. భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి పోట్ల రామ నరసయ్య రవన్న లాంటి వారి త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని, నవంబర్ 1 నుండి 9 వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ దినోత్సవం(Martyrs Commemoration Day) జరుపుకోవాలని పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా హుజూర్నగర్ డివిజన్ ముఖ్య నాయకుల సమావేశం నేరేడుచర్ల లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సూర్యాపేట జిల్లాలో తమ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వాస పల్లన్న పార్టీ డివిజన్ కార్యదర్శి సయ్యద్ ఉసేన్, పివైఎల్ జిల్లా కార్యదర్శి వాస కరుణాకర్, పి ఓ డబ్ల్యూ జిల్లా నాయకులు లక్ష్మి రజాక్ కృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు