కబడ్డీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

27-11-2026 | 10:30pm

ఆతిథ్యంలో ఎక్కడా లోటు ఉండకూడదు

భద్రతే ప్రథమ ప్రాధాన్యం

ఏర్పాట్ల పరిశీలనలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్‌నగర్, (విజయక్రాంతి): జాతీయ స్థాయిలో(National level) మహబూబ్‌నగర్(Mahabubnagar) ఖ్యాతిని చాటేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కబడ్డీ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 17 నుంచి 22 వరకు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరగనున్న పోటీల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్‌లకు నాణ్యమైన వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. క్రీడాకారుల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని, ప్రతి ఏర్పాటులో నాణ్యత, సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ఈ పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడంతో పాటు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్.పి. వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి, డీవైఎస్‌ఓ శ్రీనివాస్, నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు