సేంద్రియ ఎరువులే పొలానికి బలం
రాజాపూర్ నవంబర్ 18: రైతులు సేంద్రియ ఎరువులు(Farmers and organic fertilizers) వాడితేనే పొలం బలంగా మాది అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు(Agricultural Scientists) బాలకృష్ణ నవనీత్ అన్నారు. బుధవారం మండలంలోని మల్లేపల్లి గ్రామంలో 'ఖేత్ బచావో అభియాన్' కార్యక్రమంలో భాగంగా రైతులకు ఎరువుల సమతుల్య యాజమాన్యం పై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, భూసారాన్ని కాపాడుకోవడం, ఎరువుల సమతుల్య యాజమాన్యం, నానో యూరియా వినియోగం, యాసంగిలో ఆరుతడి పంటల సాగు, పంట మార్పిడి నేటి తక్షణ అవసరమని పేర్కొన్నారు.
యాసంగి (రబీ) సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని, వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఆరుతడి పంటలైన వేరుశనగ, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేయాలి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్ రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.