దళితఎంపీని అవమానపరచడం సరికాదు

18-11-2026 | 07:27pm

దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ కుమార్

సుల్తానాబాద్, నవంబర్ 18(విజయ క్రాంతి): నిరంతరం ప్రజా సమస్యలపై పార్లమెంటులో గలమెత్తుతూ పెద్దపల్లి పార్లమెంట్(Peddapalli Parliamentary Constituency) అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న  పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ ని పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలంలో నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పేరుతో  దళిత ఎంపీ ని అవమానించడం చాలా బాధాకరం.

దీనిని (దళిత సామాజిక హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ కుమార్ బుధవారం సుల్తానాబాద్ లో  ఖండించారు. కొందరు వ్యక్తులు వాళ్ల స్వప్రయోజనం కోసం రాజకీయ గుర్తింపు కోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎంపీ ని అడ్డుకున్నామంటూ విష ప్రచారం చేయడం విచారకరం.

ఇక ముందైనా ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులకు సరైన గౌరవం కల్పించడమే కాకుండా అధికారులందరూ ప్రోటోకాల్ నిబంధనలు  కచ్చితంగా పాటించాలని డిమాండ్ చేశారు ,దళిత ఎంపీ ని అవమానించిన నాయకులందరికి  విజ్ఞప్తి ఏంటంటే గత పది సంవత్సరాల బి.ఆర్. ఎస్ పాలనలో ఏ ఒక్క ఎంపీ చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేసి.

చూపించిన ఘనత మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  ప్రజలందరూ వంశీకృష్ణ  నాయకత్వాన్ని కోరుకొని ఆయనను భారీ మెజారిటీతో గెలిపించారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొక్కసారి దళిత ఎంపీ వంశీ క్రిష్ణ ని  విమర్శించే ముందు మీకు మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు..

మరిన్ని వార్తలు