గర్రెపల్లి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

18-11-2026 | 07:25pm

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి

​భూ కొలతల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలి

​సుల్తానాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) ​సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని(Garrepalli Village) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Paddy grain purchasing center), భూపతిపూర్ గ్రామంలో జరుగుతున్న భూమి సర్వే ప్రక్రియను(Land Survey Process) అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు(Additional Collector B. Sriramulu) క్షేత్రస్థాయిలో బుధవారం పరిశీలించారు. ముందుగా గర్రెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు(Additional Collector B. Sriramulu) మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

కేంద్రంలో ధాన్యం నిల్వలు, తేమ శాతం కొలిచే యంత్రాలు, గన్నీ సంచుల లభ్యత మరియు తూకం ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి, నిర్దేశించిన తేమ శాతం ఉండేలా కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల ద్వారా మిల్లులకు తరలించాలని, రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా ట్యాబ్ ఎంట్రీలను త్వరగా పూర్తి చేయాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు.అనంతరం భూపతిపూర్ గ్రామంలో జరుగుతున్న భూమి సర్వే ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్, భూముల సర్వేను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని రెవెన్యూ, సర్వే అధికారులకు సూచించారు.

గ్రామంలోని సర్వే నంబర్ల వారీగా విస్తీర్ణం, నక్షా (మ్యాపులు) మరియు రెవెన్యూ రికార్డులను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భూ యజమానులు, రైతుల సమక్షంలోనే సరిహద్దులను నిర్ధారించి హద్దులు ఏర్పాటు చేయాలని, సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.​ఈ పర్యటనలో సుల్తానాబాద్ తహసీల్దార్ బషీరుద్దీన్, వ్యవసాయ శాఖ అధికారులు, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు