కుమారుడి జ్ఞాపకార్థం సిమెంట్ కుర్చీలు వితరణ
07-10-2026 | 06:38pm
రాజాపూర్ అక్టోబర్ 7 :మండల పరిధిలోని రాయపల్లి మాజీ సర్పంచ్ సరోజమ్మ గౌడ్(Rayapalli former Sarpanch Sarojamma Goud) ప్రధమ పుత్రుడు కిష్టారం రమేష్ గౌడ్ 8వ వర్ధంతి సందర్భంగా బుధవారం గ్రామంలో 7 సిమెంట్ కుర్చీలు సర్పంచ్ గాయత్రి మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా గ్రామపంచాయతీకి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరోజమ్మ, ఉదేశ్ గౌడ్, మల్లేష్ గౌడ్, , ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్, వార్డు సభ్యులు ప్రవీణ్ గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహులు గౌడ్, హర్షవర్ధన్ గౌడ్, మల్లేష్ గౌడ్, తిరుపతయ్య గౌడ్, మధుసూదన్ గౌడ్, నవీన్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.