ఫార్మర్ రిజిస్ట్రీపై ప్రత్యేక సర్వే

07-10-2026 | 07:12pm

కంగ్టి, అక్టోబర్ 7(విజయక్రాంతి) : ఫార్మర్ రిజిస్ట్రీలో ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ ప్రవీణ్ చారి(Agriculture Department ADA Praveen Chari) సూచించారు.రిజిస్ట్రీ నమోదు ఐడీతో రైతు గుర్తింపు కార్డుతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ వ్యవసాయ పథకాల ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు.తడ్కల్ గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రీపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వే నిర్వహించారు.

ఏడీఏ ప్రవీణ్ చారి,ఏఓ హరీష్ పవార్ రైతుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు.నమోదు చేసుకోని రైతులు సంబంధిత ఏఈఓలను సంప్రదించాలని సూచించారు.అనంతరం గ్రామంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి స్టాక్,విక్రయ రికార్డులు,ధరల పట్టికలను పరిశీలించారు.ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు విక్రయించాలని,అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని దుకాణదారులను హెచ్చరించారు.కార్యక్రమంలో ఏఈఓ హన్మండ్లు,రైతులు అంజన్న,దత్తు,కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు