సొసైటీ పాలకవర్గమును సన్మానించిన జిపి పాలకవర్గం
నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 7 (విజయ క్రాంతి):మండలంలోని మాల్తుమ్మెద సొసైటీ పాలకవర్గం(Governing Body of the Malthummeda Society) నూతనంగా ఎన్నికైన సందర్భంగా గోపాల్పేట్ గ్రామపంచాయతీ(Gram Panchayat) పాలకవర్గం శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.
మాల్ తుమ్మెద సొసైటీ పాలకవర్గం రైతుల సమస్యలపై దృష్టి సాధించాలని రైతులకు అందుబాటులో ఉంటూ సరిపడా సేవలు అందించాలని గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్,మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ సురేందర్ గౌడ్,ఉప సర్పంచ్ గులాబ్ హుస్సేన్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మురళి మోహన్ గౌడ్, డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,గంపల వెంకన్న,సుగుణ,పద్మ, యాదమ్మ,భీమయ్య, సొసైటీ సిబ్బంది యాదగిరి, యాదుల్,విక్రమ్,కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.