మహేంద్ర హిల్స్ గురుకుల డిగ్రీ క్రీడా అకాడమీల సత్తా

07-10-2026 | 07:16pm

క్రాస్ కంట్రీలో మంజుల‌కు స్వర్ణం-హ్యాండ్‌బాల్‌లో పల్లవి, శివాణికి రజతాలు

ఘట్ కేసర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి అంకుషాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(Social Welfare Residential Women's Degree College), మహేంద్ర హిల్స్ అథ్లెటిక్స్ అకాడమీ, హ్యాండ్‌బాల్ అకాడమీ క్రీడాకారిణులు విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.

మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్గొండ జిల్లాలో అక్టోబర్ 7న (బుధవారం) నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో మహేంద్ర హిల్స్ అథ్లెటిక్స్ అకాడమీకి చెందిన డెగవత్ మంజుల 10 కిలోమీటర్ల మహిళల క్రాస్ కంట్రీ పరుగులో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

అదేవిధంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన హ్యాండ్‌ బాల్ పోటీల్లో మహేంద్ర హిల్స్ హ్యాండ్‌బాల్ అకాడమీకి చెందిన పల్లవి, శివాణి రజత పతకాలు సాధించి సత్తా చాటారు. ఒకే వేదికపై అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం, హ్యాండ్‌బాల్‌లో రెండు రజత పతకాలు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారిణులను వైస్ ప్రిన్సిపల్ ప్రత్యూష, స్పోర్ట్స్ ఇన్‌చార్జి సవిత, అధ్యాపక బృందం, అథ్లెటిక్స్ కోచ్ బిక్షపతి, హ్యాండ్‌బాల్ కోచ్ పద్మిని గుప్తా తదితరులు అభినందించారు.

మరిన్ని వార్తలు