ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సానుకూల స్పందన!
దేవరకద్ర నవంబర్ 27 విజయ క్రాంతి: మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar District) దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి(Devarkadra MLA G Madhusudan Reddy) సగర సంఘం(Sagara Sangham) వనపర్తి జిల్లా నాయకులు వినతిపత్రం సమర్పించారు.సగర సామాజిక వర్గానికి చెందిన న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని వారు ఎమ్మెల్యేను కోరారు.ఈ సందర్భంగా సగరుల డిమాండ్లకు సంబంధించిన పలు చట్టబద్ధమైన ఆధారాలు, గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను వినతిపత్రంలో పొందుపరిచారు.ముఖ్యంగా సగరులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు.
ఇందుకు సంబంధించి 1986 జూలై 15న జారీ చేసిన జీ.ఓ. ఎం.ఎస్. నంబర్లు 166, 167, 2009 ఫిబ్రవరి 19న జారీ చేసిన జీ.ఓ. ఎం.ఎస్.నంబర్ 16తో పాటు సుప్రీంకోర్టు తీర్పులు,తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను ఆధారాలుగా ప్రస్తావించారు.అదేవిధంగా బీసీ-ఏ, బీసీ-డీ వర్గీకరణకు సంబంధించిన అంశాలు, సామాజిక కులగణనకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.సగర సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సగర సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు మెండల తిరుపతయ్య సగర, కోశాధికారి గుంటి సత్యం సగర, కొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్ సగర,రాష్ట్ర నాయకులు చిర్ల శ్రీనివాసులు సగర,విష్ణు సగర,వనపర్తి, కొత్తకోట,మదనాపురం మండలాల అధ్యక్షులు ఆంజనేయులు,కురుమూర్తి వెంకటన్న సగర,జిల్లా నాయకులు చిర్ల నాగరాజు సగర, పెద్ద నాగులు సగర, గోవర్ధన్ సగర,దేవేందర్ సగర, మాజీ సర్పంచ్ వెంకటేష్ సగర, దేవన్న సగర,నరేందర్ సగర, వినోద్ సగర, నాగన్న సగర, ఎల్లస్వామి సగర,కురుమూర్తి సగర,కృష్ణయ్య సగర, శ్రీనివాసులు సగర,ఆర్కే గోల్డ్ సిటీ అరవింద్,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.