దుర్గామాత ఆలయంలో భక్తుల పూజలు
15-10-2026 | 07:29pm
నిర్మల్ అక్టోబర్ 15 ( విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో(Goddess Durga Temple) గురువారం భక్తులు పోటెత్తారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతను దర్శించుకునేందుకు భవాని భక్తులతో పాటు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర మాజీ మంత్రి విజయలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకట చారి, జగన్మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.