విద్యార్థుల సందర్శన

10-11-2026 | 06:00pm

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(Bellampalli Polytechnic College)ను విధ్యార్థులు ఇవాళ సందర్శించారు. IT, ITES,పారిశ్రామిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కోసం  విద్యార్థులు సందర్శించారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు వృత్తి విద్య, పారిశ్రామిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అవగాహన కల్పించాలనే లక్ష్యంతో Vocational Education – IT & ITES Industrial and Technical Exposure Visit కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ను 121 మంది పాఠశాల విద్యార్థులు సందర్శించారు.

ఆసిఫాబాద్ జిల్లా బాబాసాగర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9, 10వ తరగతుల 44 మంది విద్యార్థులు, మంచిర్యాల జిల్లా తీగలపహాడ్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 77 మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి ఈ సందర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ బెల్లంపల్లి అధ్యాపకులు విద్యార్థులకు కళాశాలలోని వివిధ సాంకేతిక విభాగాలు, వాటి పనితీరు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉపయోగించే పరికరాలు, ప్రయోగాత్మక శిక్షణా విధానాలను వివరించారు.

విద్యార్థులు కళాశాలలోని వివిధ వర్క్‌షాప్‌లు, కంప్యూటర్ ల్యాబ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (EEE), మైనింగ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ (EI) విభాగాల ప్రయోగశాలలను చూశారు.  ఆయా ల్యాబ్‌లలో ఉపయోగించే సాంకేతిక పరికరాలు, కంప్యూటర్ ఆధారిత అప్లికేషన్లు, పారిశ్రామిక ప్రక్రియలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి సంబంధిత విభాగాల అధ్యాపకులు ప్రత్యక్షంగా వివరించారు. విద్యార్థులకు తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాలను ఈ సందర్శన విద్యార్థులకు ఎంతో విజ్ఞానదాయకంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచిందని వారితో పాటు వచ్చిన ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేసిన రాందాస్ సార్, శివకృష్ణ సార్, EEE, EI విభాగాల అధిపతులు, అధ్యాపక బృందాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. దేవేందర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు