గోశాల వేద పాఠశాలకు స్థలం కేటాయించాలి

06-10-2026 | 05:31pm

బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బ్రాహ్మణ సేవా సమితి(Brahmin Service Society) ఆధ్వర్యంలో మంగళవారం గాయత్రీ మాతా ఆలయంతో పాటు గౌశాల,యాగశాల,వేద పాఠశాల కొరకు స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్ కృష ను కోరారు. ఈ మేరకు  వినతి పత్రం అందజేశారు. బెల్లంపల్లి బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రాహ్మణ కుటుంబాలు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ వాపోయారు.

అందరితో పాటు తమ సంఘానికి కూడా ప్రభుత్వ స్థలాన్ని కేటాయిoచాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఇప్పటికే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.

దీనిపై ఉన్నతాధికారులు, సానుకూలంగా స్పందించి తమ వంతుగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు విఎల్ఎస్ శ్రీనివాస్ రావు, కోశాధికారి జగన్మోహనాచారి,సలహాదారుడు రాంభట్ల హరీష్ శర్మ,ఈసీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు