పింఛన్ల పంపిణీలో స్వల్ప గొడవ..

18-11-2026 | 09:23pm

బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య లొల్లి 

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో పింఛన్ల పంపిణీ లో(Distribution of pensions) స్వల్ప ఘర్షణ చోటుచేసుకున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు దారుల మధ్య ఈ లొల్లి సభలో రసా బస చోటు చేసుకున్నది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్, అదనపు కలెక్టర్ చంద్రయ్య,మునిపల్ చైర్ పర్సన్ దావస్వాతి రమేష్ లబ్ధిదారులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

ఇదే క్రమంలో వేదిక ముందు 19 వార్డు బీఆర్ ఎస్ కౌన్సిలర్ షేక్ సిమ్రాన్, ఆమె భర్త కలీం ,అదే వార్డు కాంగ్రెస్ ఇంచార్జీ కాంపల్లి శ్రీనివాసు సోదరులు సతీష్ ల మధ్య గొడవ జరిగింది.19వార్డు కు చెందిన లబ్ధిదారులతో పోటో లు డీజే విషయంలో కాంగ్రెస్, బిఆర్ ఎస్ శ్రేణుల  మధ్య గొడవ తో  స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య లొల్లితో అక్కడ రసాబాస చోటుచేసుకున్నది.

అప్పటికే బీఆర్ఆర్ కౌన్సిలర్ బంధువులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్త సతీష్ పై దాడి చేశారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలను సముదాయించారు. పోలీసులు వచ్చి వారిని శాంతి చేశారు.

ఇరు వర్గాలు ఒకరి పై ఒకరు బెల్లంపల్లి వన్ టౌన్ పోలిస్టేషనల్లో ఫిర్యాదు చేసుకున్నారు. మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి రమేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్, బీఆర్ఎస్ మద్దతు దారులు  పోలిస్టేషన్ కు చేసుకున్నారు. ఇరువర్గాల గొడవ కాంగ్రెస్, బిఆర్ ఎస్ పార్టీలకి ప్రతిష్టాత్మకంగా మారింది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు