కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలి

03-11-2026 | 06:00pm
  1. ప్రభుత్వం రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి
  2. సిపిఐ నేత కలవేన శంకర్

మందమర్రి, (విజయక్రాంతి) : రాష్ట్రంలోని కరువు మండలాల్లో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టి, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్(CPI State Secretariat member Kalavena Shankar) డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం లోని సారంగపల్లి, ఆదిల్ పేట, పొన్నారం, శంకర్ పల్లె, చిర్రకుంట గ్రామాల్లో ఆయన పర్యటించి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కలవేన శంకర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 369 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కరువు సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రతి మండలంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం జరిపి రైతులకు అండగా నిలవాలని కోరారు.

రాష్ట్రంలో, దేశంలో 85 శాతం మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి రైతుల సంక్షేమాన్ని విస్మరించి పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పాలకుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నవంబర్ 10వ తేదీన అన్ని కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన మండలాలతో పాటు వర్షాభావంతో నష్టపోయిన ఇతర మండలాల్లోనూ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు రామడుగు లక్ష్మణ్, మిట్టపెల్లి వెంకటస్వామి, మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, భీమనాధుని సుదర్శన్, దాగం మల్లేష్, మిట్టపల్లి శ్రీనివాస్, వనం సత్యనారాయణ, కామెర దుర్గారాజ్, మిట్టపల్లి పౌలు, బొంతల లక్ష్మీనారాయణ, ఆడపు రాజమౌళి, గుండా మాణిక్యం, మామిడి గోపి, నక్క వెంకటస్వామి, జాడిపోశం, దేవి పోశం, పూజారి రామన్న, కొత్తపెళ్లి మహేష్, పెరిక సంపత్, మేకల రాజేశం, రత్నం రాజం, దొంతుల రాజన్న పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు