జాతీయ రహదారిపై దసలి
సాగు గిరిజనుల రాస్తారోకో
చెన్నూరు, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial district) చెన్నూరు జాతీయ రహదారిపై దసరి సాగు రైతులు(Dasari Silk Farmers) బుధవారం రాస్తారోకో చేశారు. మండలంలోని కిష్టంపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో దసలి పట్టు పురుగుల పెంపకం రైతులపై అటవీశాఖ(Forest department) అధికారులు ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులుకు గరిచేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున గిరిజన ఆదివాసి రైతులు రోడెక్కారు.
కిష్టంపేట జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద రైతులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఎన్నో యేండ్లు గా దససరి పట్టు సాగు చేసుకుంటున్న తమను అటవీ ప్రాంతంలో పట్టు పురుగుల పెంపకం కొనసాగించవద్దని అధికారులు నిరంకుశంగా వ్యవహారిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అటవీ ప్రాంతంలోకి వెళ్లే దారిని మూసివేయడంతో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని వాపోయారు.
దసలి పట్టు రైతులకు మద్దతుగా పలు సంఘాల ప్రతినిధులు సైతం మంచిర్యాల నుంచి చెన్నూరుకు వెళ్లే జాతీయ రహదారిపై బైఠాయించి వారికి మద్దతుగా నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ రైతులు సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న చెన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించారు.