తవ్వే కొద్దీ భయటపడుతున్న తప్పుడు డెత్ సర్టిఫికెట్లు

17-11-2026 | 05:10am

పొరుగు జిల్లావాసులకూ జారీ..

ప్రజావాణిలో ఫిర్యాదు 

బెల్లంపల్లి, నవంబర్ 16 : జిల్లాలో కలక లం రేపిన నకిలీ అక్రమ డెత్ సర్టిఫికెట్ల(Fake and illegal death certificates) వివాదం  ముదిరుతుంది. కారకులకు ఉ చ్చు బిగుస్తోంది. బెల్లంపల్లి మండలం(Bellampalli Mandal) బూధఖుర్దు పంచాయతీలో వెలుగు చూసిన ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్లపై(Fake death certificates) ప్రజావాణిలో అధికారి పార్టీ పెద్దల కనుసన్నులలో ఈ వ్యవహారం జరిగినట్టు సాక్షాలతో బీఆర్ఎస్ నేతలు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ తొంగళ సత్యనారాయణతో పాటు బూధఖుర్దు ఉ ప సర్పంచ్ సుంకరి ప్రశాంతి, వార్డు సభ్యు లు ఫిర్యాదు చేయడంతో ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

‘అక్రమ పట్టాలకు భారీ స్కెచ్‘ శీ ర్షికన ‘విజయక్రాంతి’ లో వచ్చిన నిజాలను నిగ్గు తేల్చిన కథనం అధికారపార్టీ ప్రతినిధు లు, అధికారుల్లో ఒక్కసారి వణుకు పుట్టించి ంది. అదేవిదంగా ప్రతిపక్ష నేతల్లో కదలిక తె చ్చింది. బెల్లంపల్లి మండలంలో దా దాపు అ న్ని గ్రామాల్లోనూ ఈ నకిలీ అక్రమ డెత్ సర్టిఫికెట్లు జారీ జరిగినట్టు ప్రజావాణిలో ఫిర్యా దు చేయడం మరో సంచలనం. ఈ లెక్కనా తవ్విన కొద్ది నకిలీ డెత్ సర్టిఫికెట్లు వెలుగు చూసే పరిస్థితి కనిపిస్తోంది. డెత్ సర్టిఫికెట్ల రాకెట్ ప్రతీ గ్రామానికి లింకు ఉన్నదనేది కాదనలేని వాస్తవం.

ఒకే మండలంలో వేరు వేరు గ్రామాలకు చెందిన డెత్ సర్టిఫికెట్ల జా రీలో జరిగిన అక్రమాల్ని పెద్ద నేరంగా ఆసక్తి రేపింది. ఒకే మండలం పరిధిలో ఒక గ్రామ నివాసికి మరోగ్రామంలో డెత్ సర్టిఫికెట్ల మ ంజూరే అక్రమ అయినప్పుడు, పొరుగు జిల్లా వాసులకు బెల్లంపల్లి మండలం నుంచి డెత్ సర్టిఫికెట్ ఇవ్వడం ఎంత పెద్ద నేరం కా వాలి..? అసలు ఎలా ఇస్తారనేది మరో స ంచలన వాస్తవం ప్రజావాణి ఫిర్యాదుతో వె లుగులోకి వచ్చింది. అందుకు సంబంధించి న సాక్ష్యాధారాలతో తప్పుడు పత్రాలను  ప్ర జావాణిలో ప్రతిపక్ష నేతలు అందజేశారు.  క రీంనగర్, పెద్దపల్లి జిల్లాల వాసులకూ నకిలీ డెత్ సర్టిఫికెట్లు జారీ జరిగినట్టు తెరపైకి తీసు కొచ్చారు. ఈ అక్రమాలు పునరావృతం కా కుండా చేయాలని అభిప్రాయ పడుతున్నారు. 

మరిన్ని వార్తలు