భారత విప్లవ వీర మాత వెంకటమ్మ కు జోహార్లు

05-11-2026 | 11:17pm

వెంకటమ్మ ఎనిమిదవ వర్ధంతి

బెల్లంపల్లి: భారత విప్లవోద్యమానికి తన బిడ్డను అందించిన ఆ వీరమాత ఎనిమిదవ వర్ధంతి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాలబస్తీలో ఇవాళ నిర్వహించారు. అమరుడు సీపీఐ మావోయిస్టు పార్టీ పొలిటి బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ (ఆనంద్) తల్లి కటకం మల్లమ్మ 8వ వర్ధంతి నీ చిన్న కొడుకు కటకం సతీష్ నిర్వహించారు. అనారోగ్యంతో వెంకటమ్మ అసువులు బాసి ఎనిమిదేళ్లు అవుతుంది. మాజీ మావోయిస్టు కటకం సుదర్శన్ భార్య ఊరే, సోదరుడు కటకం సతీష్ కుటుంబ సభ్యులు  మల్లమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.

భారత విప్లవోద్యమానికి తన బిడ్డను అందించిన మల్లమ్మ త్యాగం మరోసారి విప్లవభిమాలు నెమరు వేసుకుంటున్నారు. కటకం సుదర్శన్ తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి నూతన సమాజ నిర్మాణం కోసం అడవి బాట పట్టారు. వెన్ను చూపకుండా నాలుగు దశాబ్దాలు విప్లవోద్యమంలోనే తుది శ్వాస విడిచే వరకూ పోరు బాటను వదిలిపెట్టలేదు. అమ్మ వర్ధంతి స్మృతీలో కటకం సుదర్శన్ ను త్యాగాలను  యాది చేసుకుంటున్నారు. వీరమాత చిత్ర  పటానికి ప్రజాకళాకరుడు ఆడెపు సమ్మయ్య శ్రద్ధాంజలి ఘటించారు.

మరిన్ని వార్తలు