నియోజకవర్గ ఇన్చార్జిగా తాళ్ళరవి కుమార్
బెల్లంపల్లి: ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం(All India SC/ST Rights Protection Association) బెల్లంపల్లి నియోజకవర్గ(Bellampally Constituency) ఇన్చార్జిగా తాళ్ల రావి కుమార్ ను నియమించినట్లు ఆ సంఘం కేంద్ర కమిటీ నాయకులు రసూరి చంద్రశేఖర్ (ప్రధాన కార్యదర్శి) ఏ. శివరాజ్ (వర్కింగ్ ప్రెసిడెంట్) ఒక ప్రకటనలో తెలిపారు.
బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడం, కొత్త సభ్యత్వాలను నమోదు చేయడం, వివిధ ప్రాంతాల్లో సంఘం శాఖలను ఏర్పాటు చేయడం, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సంఘం కార్యకలాపాలను విస్తృతంగా కొనసాగించడం వంటి బాధ్యతలను టి. రావి కుమార్కు అప్పగించినట్లు తెలిపారు.
సంఘం ఆశయాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో సంఘాన్ని పటిష్టంగా నిర్మించేందుకు తాళ్ళ రావి కుమార్ పూర్తి బాధ్యతతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రంలో ప్రధాన కార్యదర్శి రసూరీ చంద్రశేఖర్,ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం కేంద్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ శివరాజ్ ఉన్నారు.