డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు

14-10-2026 | 09:02pm

చేగుంట అక్టోబర్ 14 విజయక్రాంతి: చేగుంట పట్టణ కేంద్రం లో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్(B.R. Ambedkar) బౌద్ధ మతం(Buddhism) స్వీకరించిన చారిత్రాత్మక ధమ్మదీక్ష దినోత్సవం (1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిలో బౌద్ధం స్వీకరించిన రోజు) సందర్భంగా బుధవారం పట్టణ కేంద్రం లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పి. విష్ణు కుమార్ మాట్లాడుతూ.. నవభారత నిర్మాత, దేశ తొలి న్యాయశాఖ మంత్రి డా. బి.ఆర్. అంబేద్కర్ దేశంలోని అన్ని వర్గాల ప్రజల స్వేచ్ఛ, సమానత్వం కోసం అహర్నిశలు పోరాడారని కొనియాడారు; మనువాదులు కులం పేరిట ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నింటినీ అధిగమించి, దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ ఫలాలు అందించిన మహోన్నత మానవతావాది అంబేద్కర్ అని,

ఆయన దేశానికి చేసిన సేవలను ప్రపంచ దేశాలు సైతం కొనియాడటం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఎర్ర యాదగిరి, స్టాలిన్ నర్సింలు, బక్క బాబు, బాలేష్, అక్బర్, నరేష్, రాజు, జీవన్, గణేష్, అంజి, నవీన్, ప్రవీణ్, విపుల్, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు