కిట్స్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
కోదాడ అక్టోబర్ 14,(విజయ క్రాంతి): స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో(Local KITS Women's Engineering College) బతుకమ్మ సంబురాలు బుధవారం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ ఉత్సవాలలో అమ్మవారు రూపాలైనటువంటి తొమ్మిది అవతారాలను విద్యార్థినులు ధరించి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరిగింది.
విద్యార్థినులు స్వయంగా బతుకమ్మ లను పేర్చడం, తెలంగాణ సంస్కృతి కి నిదర్శనం అని,ఈ బతుకమ్మ సంబురాలలో పాల్గొన్న విద్యార్థినులను కళాశాల వైస్ చైర్మన్ నీలా అరుణదేవి అభినందించడం జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ పాల్గొని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ నిదర్శనమని అన్నారు.
మున్సిపల్ కమీషనర్ రమాదేవి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ మనకు ప్రకృతిని ప్రేమించడం, సంప్రదాయాలను గౌరవించడం, ఐకమత్యంతో జీవించడం వంటి విలువలను నేర్పుతుందని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దేవర పల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ, బతుకమ్మ పండగ – తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ వేడుక బతుకమ్మ అని అన్నారు.
ఈ కార్యక్రమం లో కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, వారి మాతృమూర్తి నీలా పాండురమ్మ, ప్రిన్సిపాల్ గాంధీ, మహిళా అధ్యాపకులు స్రవంతి,రాజశ్రీ, సరిత, జ్యోతి, నాగలక్ష్మి, ఉమారాణి, అనిత అరుణ, మౌనిక, చైతన్య కమలాకుమారి, నైనీత, ఊర్మిళ, నాయిని లక్ష్మి , విద్యార్థి నులు పాల్గొన్నారు.