గిరి ప్రదక్షణ స్ఫూర్తి దాత
పుట్టినరోజు వేడుకలు
కొడిమ్యాల (విజయక్రాంతి): కొండగట్టు, కొత్తపల్లి, మైలారం గిరి ప్రదక్షణ స్ఫూర్తి దాత సురేష్ ఆత్మారాం మహారాజు పుట్టినరోజు వేడుకలను బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమం(Veera Brahmendra Orphanage), హౌసింగ్ బోర్డు కాలనీలో కరీంనగర్ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తూ హిందువులను ఐక్యం చేయుటకు అనేక గిరి ప్రదక్షిణలు ప్రారంభం చేసిన గురువు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి, నార్ల శ్రీనివాస్, చొక్కారపు శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, ఇజ్జగిరి శ్రీనివాస్, పొన్నం శ్రీనివాస్, గోనె శ్రీనివాస్, గౌతమ్ విశిష్ట (శ్రీనివాస్) తదితరులు పాల్గొన్నారు.