దిల్‍సుఖ్‌నగర్‌లో పీఎంజే జ్యువెలర్స్ స్టోర్

14-10-2026 | 08:52pm

ఎల్బీనగర్, అక్టోబర్ 14 : దిల్‍సుఖ్‌నగర్‌లో పీఎంజే జ్యువెలర్స్ స్టోర్ ను(PMJ Jewellers store) బుధవారం ప్రారంభించారు.  నాలుగు రాష్ట్రాల్లోని పీఎంజే రీటైల్ నెట్‌వర్క్ స్టోర్ల సంఖ్య 47కి చేరిందని స్టోర్ మేనేజర్ మధన్ కుమార్ తెలిపారు. అద్భుతమైన హస్తకళా నైపుణ్యానికి పీఎంజే జ్యువెలర్స్ ప్రసిద్ధి అని పీఎంజే జ్యువెలర్స్ తెలంగాణ క్లస్టర్ హెడ్ దీపక్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ గోల్డ్ నెక్లెస్‌లు, వడ్డాణాలు, బ్రైడల్ జ్యువెలరీ సెట్లు, హాఫ్-చీర, అకేషన్-వేర్ ఆభరణాలు, డైమండ్ జ్యువెలరీతో పాటు రంగురంగుల రత్నాలతో తయారు చేసిన అలంకరణలు ఉన్నాయని తెలిపారు. పీఎంజే జ్యువెలర్స్ సీఈవో కిరణ్ షిండే మాట్లాడుతూ..

పీఎంజే జ్యువెలర్స్ సాంప్రదాయ కళను, ఆధునిక డిజైన్‌ను ఏకం చేస్తూ.. నాణ్యత, పారదర్శకత  తరతరాలుగా వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు.  తెలంగాణ క్లస్టర్ హెడ్ శ్రీ దీపక్ మాట్లాడుతూ.. అసాధారణమైన హస్తకళా నైపుణ్యం, సమకాలీన డిజైన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పీఎంజే జ్యువెలర్స్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు