దసరా సెలవుల్లో వర్క్ సీట్ల పంపిణీ
14-10-2026 | 08:59pm
కొడిమ్యాల, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) మల్యాల మండలం నూకపెల్లి ప్రాథమిక పాఠశాల ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు బుధవారం దసరా సెలవుల సందర్భంగా విద్యార్థులు ఖాళీగా ఉండకుండా తెలుగు పాఠ్యాంశానికి సంబంధించిన ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసి తెలుగులో వర్ణమాల సరళ అక్షరాలు, పదాలు, వాక్యాలు గుర్తించడం అవగాహన చేసుకోవడం, చదవడం, రాయడం, జతపరచడం వంటి కృత్యాలను హెచ్ఎం హరికృష్ణ ప్రసాద్ ఇంటి వద్ద తల్లిదండ్రుల సమక్షంలో అందించడం జరిగింది. విద్యార్థులు ఈ దసరా సెలవులను వినియోగించుకోవాలని కోరారు.