సెంట్రల్ మీడియన్లతో ప్రమాదాల తగ్గింపు
టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి
ఎల్బీనగర్, అక్టోబర్ 14 : సాగర్ రింగ్ రోడ్డు నుంచి కర్మన్ఘాట్ రోడ్డు పరిధిలో సెంట్రల్ మీడియన్లతో(Central medians) రోడ్డు ప్రమాదాలను(Road accidents) పూర్తి స్థాయిలో తగ్గించవచ్చని టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్మన్ఘాట్ రోడ్డు, సాగర్ రింగ్ రోడ్డు, బైరామల్గూడ నుంచి సాగర్ ఎక్స్ రోడ్స్ వరకు జరుగుతున్న భద్రతా పనులను బుధవారం ఆయన పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు రహదారులకు విస్తరిస్తున్నామని, వాహనదారులతో పాటు పాదచారుల భద్రతకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలు రహదారులను సురక్షితంగా దాటేందుకు అవసరమైన క్రాసింగ్ సదుపాయాలు, పాదచారులకు అనువైన మార్గాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి
లింగోజిగూడ డివిజన్ విజయపురి కాలనీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయానికి కార్యకర్తలందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.