హున్సాలో ఇసుక త్రవ్వకాలపై రైతుల నిరసన ​​

14-10-2026 | 09:04pm

సాలూర, అక్టోబర్ 14(విజయక్రాంతి): ​సాలూర మండలంలో​​ ​గల ముంపు గ్రామం(mumpu village) హున్సాలో ఇసుక త్రవ్వకాల వల్ల తమకు నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గ్రామ శివారు​ నుంచి ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.  ​గతేడాది మంజీరా నది వడ్డున ఇసుక తీయడం వల్ల జరిగిన ప్రవాహానికి గ్రామంలోని పంటలు నీట మునిగి నష్టపోయాయని, ఊర్లోకి నీరు రావడం జరిగిందని తెలిపారు.

నష్టపోయిన పంటలకు సంబంధించి నష్టపరిహారం కోరినా ఇంతవరకు అందలేదని వాపోయారు. ​పక్కనే ఉన్న బాన్సువాడ నియోజకవర్గం రామ్‌గంగానగర్ ప్రాంతంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం కోసం హున్సా​ నుంచి ఇసుక తీసుకెళ్తున్నారని, నది వడ్డున ఉన్న భూముల నుండి గత పదిహేను రోజులుగా వేలాది ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు​​.

ఇలా ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి, మోటార్లు నడిచే పరిస్థితి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.  ముంపు గ్రామం జాబితాలో ఉన్న హున్సాను ఈ త్రవ్వకాల ద్వారా మరింత ప్రమాదంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల​ని రైతులు ​​కోరారు.

మరిన్ని వార్తలు