రక్తదాన శిబిరంలో పాల్గొన్న మండల సర్పంచ్ లు
మనోహరబాద్, అక్టోబర్ 28, (విజయక్రాంతి): ప్రమాదాలకు గురై తీవ్ర గాయాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి అత్యవసర సమయంలో కావలసిన రక్తం అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్న మనోహరాబాద్ పోలీసులు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ(Police Commemoration Day) సందర్భంగా మనోహరాబాద్ మండల కేంద్రంలోని శుభం గార్డెన్స్ లో రక్తదాన శిబిరాన్ని పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పోతారం గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ ప్రోద్బలం గ్రామ యువకులైన మంచే శ్రీరాములు, వీరి మిత్రబృందం రక్తదాన శిబిరంలో పాల్గొని తమవంతు సహాయంగా రక్తాన్ని అందించారు. ఇందులో మనోహరబాద్ మండల సర్పంచ్ లు పెంటగౌడ్, నాయకులు పురం రవి, శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ కళ్యాణ్, వీరి మిత్రబృందం, తదితరులు ఉన్నారు.