పాపన్నపేట ఉన్నత పాఠశాలలో వ్యక్తిత్వ వికాస తరగతులు

28-10-2026 | 03:42pm

ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కిషోర్ కుమార్

పాపన్నపేట,అక్టోబర్28: మండల పరిధిలోని పాపన్నపేట ఉన్నత పాఠశాలలో(Papannapet High School) బుధవారం వ్యక్తిత్వ వికాస తరగతులు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రముఖ మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కిషోర్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మనోధైర్యాన్ని కలిగి ఉండాలని, కుంగుబాటుకు గురికావద్దని సూచించారు.

ప్రతి ఒక్కరు ఏదో ఒక రంగంలో విశిష్టమైన నైపుణ్యం ఉంటుందని, దానిని వెలికి తీసి ముందుకు వెళ్లాలన్నారు. అదేవిధంగా కెరీర్ గైడెన్స్ పైన డిగ్రీ కళాశాల స్కిల్  డెవలప్మెంట్ మెంటార్ ఆంజయ్య విద్యార్థులకు పదవ తరగతి తర్వాత ఏ ఏ కోర్సుల్లో చేరాలి, ఏ అవకాశాలుంటాయో వివరంగా తెలిపారు.

తదనంతరం కెరీర్ గైడెన్స్ కరపత్రాలను ఆవిష్కరించి విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశం, నాగరాజు, అంజాగౌడ్, ప్రవీణ్, మోహన్ రావు, రియాజ్, విశ్వనాథ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు