నవంబర్ 1న ప్రతిభ స్కాలర్ షిప్ పరీక్ష

28-10-2026 | 05:37pm

ఇన్చార్జి జిల్లా విద్యాధికారి చంద్రయ్య

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): నవంబర్ 1న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష(National Means-cum-Merit Scholarship Examination) నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇన్చార్జి జిల్లా విద్యాధికారి పి.చంద్రయ్య తెలిపారు. నవంబర్ 1న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.

పరీక్ష నిర్వహణ కోసం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కాలేజ్ రోడ్డులో గల గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేయడం చేశామన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని కోరారు.

మరిన్ని వార్తలు