వడ్ల కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి

20-11-2026 | 08:57pm

అదనపు జిల్లా కలెక్టర్ విజయేందర్ రెడ్డి

ఎదులాబాద్, మాదారం దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనికి

ఘట్ కేసర్, నవంబర్ 20 (విజయక్రాంతి) : వడ్లు దింపుకొను సమయంలో రైతులకు(Farmers') ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఎదులాబాద్, మాదారం దాన్యం కొనుగోలు  ఇన్చార్జికి అదనపు జిల్లా కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి(Additional District Collector D. Vijayender Reddy) ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శుక్రవారం అదనపు జిల్లా కలెక్టర్ డి.విజయేందర్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎల్. సుగుణబాయి, డీఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, ఘట్ కేసర్ తహసీల్దార్(Ghatkesar Tahsildar) చంద్ర శేఖర్, ఏఈఓ అధికారులుతో కలిసి ఎదులాబాద్, మాదారం లలో దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనికి నిర్వహించారు.

ఇందులో భాగంగా తగినంత హమాలీలను ఏర్పాటు చేసి, దాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, వడ్లు దింపుకొను సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని దాన్యం కొనుగోలు ఇన్చార్జికి ఆదేశాలు జారీచేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు  బాధ్యతాయుతంగా వ్యవహరించి, కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

ముఖ్యంగా ట్యాబ్ ఎంట్రీలు ఆలస్యమవడం వల్ల రైతుల చెల్లింపులు ప్రభావితమవుతున్నందున, ప్రతి ఎంట్రీను అదే రోజు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆకాల వర్షాల కారణం గా దాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రంలో అవసరమైన టార్పాలిన్లు తగు మొత్తం వుండునట్టుగా చుసుకోవలసింది కొనుగోలు కేంద్ర ఇన్చార్జీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

రైతు తమ ధాన్యం అమ్మిన 48 గంటలలో నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. చివరగా అందరు సంబదిత అధికారులు సమిష్టిగా పనిచేసి జిల్లాకు, ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు విషయంలో మంచి పేరు తీసుకురావలసిందిగా కోరడమైనది.

మరిన్ని వార్తలు