బాలాజీనగర్‌లో... నిత్య అన్నదానం ప్రారంభం

20-11-2026 | 08:59pm

అయ్యప్ప ఆలయ కమిటీ చైర్మన్  రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా

జవహర్ నగర్, నవంబర్ 20 (విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్(Jawahar Nagar) లో మన బాలాజీనగర్‌లో గల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గురువారం నుంచి నిత్య అన్నదాన కార్యక్రమం మొదలైంది. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నప్రసాద  కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అన్నారు. అందులో అయ్యప్పలకు అన్నదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి కరుణతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ జమాల్‌పూర్ నవీన్ కుమార్ స్వామి, క్యాషియర్ చెన్నారెడ్డి స్వామి, శ్రీమన్నారాయణ స్వామి, సిద్దేశ్వర స్వామి, రెడ్డిశెట్టి మహేష్, భిక్షపతి, సేటు, కారింగుల  వెంకటేష్, శ్రీనాథ్, ఏన్నం కిట్టు స్వామి, ప్రేమఖైదీ నరసింహస్వామి, రమణారెడ్డి స్వామి, కొండల స్వామి, సతీష్ స్వామి, వెంకటాచారి, బి. శ్రీనివాస్ స్వామి, కృష్ణ స్వామి, సంజయ్ స్వామి, సాయి స్వామి, అయ్యప్ప భక్తులు, సేవకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు