పేదలకు భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి

20-11-2026 | 08:45pm

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేసిన తుంగతుర్తి రవి

మేడిపల్లి, నవంబర్ 20 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Ministers Relief Fund) పేదలకు ఆపన్నహస్తంగా నిలుస్తోందని మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి(Medipally Division Congress Party President Tungaturti Ravi) అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని 9వ డివిజన్ మేడిపల్లి విష్ణుపురి కాలనీకి చెందిన పర్సాపురం అరవింద్‌కు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా(Medchal–Malkajgiri District) డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్(Thotakura Vajresh Yadav) సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కును శుక్రవారం తుంగతుర్తి రవి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అందజేశారు.

ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు